SSMB 29 : అనౌన్స్ మెంట్ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా ?

SSMB 29 : అనౌన్స్ మెంట్ కోసం అప్పటివరకు ఆగాల్సిందేనా ?

Published on Mar 25, 2024 11:02 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. దీని అనంతరం త్వరలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించనున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 లో నటించనున్నారు. ఇప్పటికే కథ లాక్ అయిన ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ భారీ వ్యయంతో నిర్మించనున్న ఈమూవీ ఫై ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. విషయం ఏమిటంటే, నిజానికి ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ రానున్న ఏప్రిల్ 9న ఉగాదికి వస్తుందని అందరూ భావించారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ మహేష్ బాబు పుట్టినరోజైన ఆగష్టు 9న ఉంటుందని, అప్పటివరకు ఆగాల్సిందే అని అంటున్నారు. ఈలోపు దానికి సంబందించి మూవీ టీమ్ నుండి ఒక అప్ డేట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు