SSMB 29 : ఆ విషయమై హుకుం జారీ చేసిన జక్కన్న ?

SSMB 29 : ఆ విషయమై హుకుం జారీ చేసిన జక్కన్న ?

Published on Apr 20, 2024 5:16 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ల క్రేజీ కాంబో SSMB 29 మూవీ యొక్క అనౌన్స్ మెంట్ కోసం మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనుండగా కీరవాణి సంగీతాన్ని సాయి మాధవ్ బుర్రా మాటలని అందించనున్నారు. కాగా ఈ ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ కోసం ఇప్పటికే బాడీ పరంగా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేస్తున్నారు సూపర్ స్టార్.

అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల కొన్నాళ్లుగా SSMB 29 మూవీకి సంబంధించి పలు పుకార్లు పలు మీడియా మాధ్యమాల్లో షికారు చేస్తున్న నేపథ్యంలో ఇకపై తమ మూవీకి సంబంధించి ఏ ఒక్క యూనిట్ సభ్యులు ఎటువంటి న్యూస్ బయటకు లీక్ చేయకూడదని జక్కన్న రాజమౌళి హుకుం జారీ చేసినట్లు టాక్. ప్రస్తుతం వేగంగా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిన ఈ మూవీ, సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినమైన ఆగష్టు 9న అనౌన్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు