SSMB 29 : టెక్నీకల్ క్రూ ఫిక్స్ ?

SSMB 29 : టెక్నీకల్ క్రూ ఫిక్స్ ?

Published on Feb 13, 2024 2:01 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్సకత్వంలో భారీ పాన్ వరల్డ్ మూవీ SSMB 29 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కోసం మహేష్ బాబు మేకోవర్ పరంగా బాడీ పెంచడంతో పాటు గడ్డం, క్రాఫ్ కూడా పెంచుతూ స్టైలిష్ గా సిద్ధం అవుతున్నారు. ఇక ఈ మూవీని కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, ఈ మూవీ యొక్క టెక్నీకల్ క్రూ వీరే అంటూ ఒక న్యూస్ అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది.

దాని ప్రకారం ఈ ప్రతిష్టాత్మక మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఎడిటర్ గా తమ్మిరాజు, సినిమాటోగ్రాఫర్ గా పీఎస్ వినోద్, విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా ఆర్ సి కమల కన్నన్, ప్రొడక్షన్ డిజైనర్ గా మోహన్ బింగి, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ గా రమా రాజమౌళి ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ పై ఆ మూవీ మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రపంచం మొత్తం కూడా ఈ మూవీ యొక్క అనౌన్స్ మెంట్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు