SSMB : ఆ విషయంలో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న సూపర్ స్టార్ ?

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలో జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న భారీ పాన్ వరల్డ్ మూవీ SSMB 29 లో నటించనున్న విషయం తెలిసిందే. ఈమూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుండగా కీరవాణి సంగీతాన్ని విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. ఇప్పటికే కథ లాక్ అయిన ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

అయితే విషయం ఏమిటంటే, మరోవైపు తాజాగా యూరోప్ లో తన ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం అక్కడి పలువురు నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేకముగా స్కెటింగ్ లో శిక్షణ తీసుకుంటున్నారట. మరోవైపు తన పాత్ర కోసం పూర్తిగా క్రాఫ్, గడ్డం పెంచుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక త్వరలో ఈ మూవీని ఒక కాన్సెప్ట్ వీడియో ద్వారా అనౌన్స్ చేయనున్నారని టాక్. మరి ఈ ప్రతిష్టాత్మక మూవీ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో తెలియాలి అంటే కొన్నాళ్ల వరకు ఆగాల్సిందే.

Exit mobile version