SSMB29 : మహేష్ దర్శనం అప్పుడు వరకు ఉండదు?

SSMB29 : మహేష్ దర్శనం అప్పుడు వరకు ఉండదు?

Published on Feb 25, 2024 9:00 AM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్న మోస్ట్ అవైటెడ్ అండ్ సెన్సేషనల్ కాంబినేషన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ అనే చెప్పాలి. ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ఈ చిత్రం ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో లాంచ్ కాబోతుంది.

అయితే మహేష్ బాబు కెరీర్ లో 29వ ప్రాజెక్ట్ గా ఈ సినిమాని చాలా జాగ్రత్తలు వహిస్తూ మేకర్స్ ప్లాన్ చేస్తుండగా మహేష్ బాబు అయితే తన కెరీర్ లోనే ఏ సినిమాకి కూడా పెట్టని ఎఫర్ట్స్ ని ఈ చిత్రానికి అంతకు మించిన రేంజ్ లో పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. ఇప్పుడు తన బాడీ బిల్డప్ ని కంప్లీట్ గా తన ఫేసియల్ లుక్ ని కూడా మార్చేయనున్నాడు.

అయితే ఈ చిత్రం కోసం మహేష్ ప్రిపేర్ చేస్తున్న ఈ సరికొత్త లుక్ విషయంలో ఇంట్రెస్టింగ్ టాక్ తెలుస్తుంది. మహేష్ ప్రిపేర్ చేసిన ఈ సరికొత్త లుక్ టెస్ట్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మహేష్ దర్శనం అయితే తన ఫ్యాన్స్ కి బయట కనిపించదు అని తెలుస్తుంది. లుక్ టెస్ట్ కంప్లీట్ అయ్యాకే అన్నీ బయటకి వస్తాయని టాక్. అప్పుడు వరకు మహేష్ తన సరికొత్త లుక్ ని ప్రిపేర్ చేసే పనిలో ఉండనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు