రవితేజ తన 66వ చిత్రాన్ని గొపిచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. నటీనటులుగా పెద్ద స్టార్లనే ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఒక కీలక పాత్ర కోసం ప్రముఖ తమిళ నటుడు సముద్రఖనిని తీసుకున్నారు. అయితే ఈయన పాత్ర ఎలా ఉంటుంది అనేది మాత్రం ఇంకా రివీల్ కాలేదు.
ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు నిర్మించనున్నారు. ‘డాన్‌శీను, బలుపు’ చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ నెలకొని ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రం ప్రముఖ తమిళ సినిమా ఆధారంగా రూపొందుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందునుందని తెలుస్తోంది.


