‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి ఫినిషింగ్ టచ్ ఇస్తున్న స్టార్ బ్యూటీ!

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh)చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీలీల అలాగే రాశిఖన్నా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి వీరిలో ఓ స్టార్ బ్యూటీ ఇప్పుడు ఫినిషింగ్ టచ్ ఇస్తుంది. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు టాలెంటెడ్ బ్యూటీ రాశిఖన్నా.

లేటెస్ట్ గా ఓ పోస్ట్ ద్వారా తను ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ పనులు మొదలు పెట్టినట్టు కన్ఫర్మ్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ నేతృత్వంలో డబ్బింగ్ స్క్రిప్ట్ తో బిజీగా ఉన్నట్టు తెలిపింది. సో ఉస్తాద్ భగత్ సింగ్ పనులు అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version