రిస్క్ చేయబోతున్న స్టార్ కమెడియన్ ?

Sapthagiri

నూతన దర్శకుడు డి.రామ‌కృష్ణ దర్శకత్వంలో కమెడియన్ స‌ప్తగిరి హీరోగా తెరకెక్కబోతున్న చిత్రం ‘గజదొంగ’. ఇప్పటికే స‌ప్తగిరి ‘స‌ప్తగిరి ఎక్స్ ప్రెస్‌’, ‘స‌ప్తగిరి ఎల్‌.ఎల్‌.బి’ చిత్రాల్లో హీరోగా నటించాడు.ఇప్పుడు గజదొంగ చిత్రంతో మళ్ళీ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కాగా, ఈ సారి సప్తగిరి కామెడీ మూవీ కాకుండా, తన రూటు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రధానంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కనుందని సమాచారం. ఈ కథ విలేజ్ మరియు టౌన్ నేపథ్యంలో సాగుతుందట. కమెడియన్ గా ముద్రపడిన సప్తగిరి యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ రిస్క్ చేయబోతున్నాడు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి. ఆగ‌స్టు రెండో వారంలో షూట్ కి వెళ్ళబోతున్న ఈ చిత్రాన్ని నంద నంద‌నా ప్రాజెక్ట్స్ బ్యానర్ పై శ‌ర్మ చుక్కా, యెడల నరేంద్ర సంయుక్తంగా నిర్మించనున్నారు.

Exit mobile version