మహేష్ సాంగ్ పై స్టార్ క్రికెటర్ షాడో బ్యాటింగ్ !

Published on May 25, 2020 10:57 am IST

స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ వీరబాదుడుకు స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు ఎన్నో. అదే జోష్‌ను సౌత్ సినిమా పై కూడా కనబరుస్తున్నాడు వార్నర్‌. ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ సౌత్ సినిమా మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస సినీ వీడియోలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు.

బుట్టబొమ్మ సాంగ్ తో మొదలెట్టి అందరి హీరోలను మహేష్ , ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అందరి సాంగ్స్ అండ్ డైలాగ్స్ పై వీడియోలు చేసి ఆకట్టుకుంటున్నాడు. తాజాగా మహేష్ సాంగ్ లోని ఫేమస్ కోరస్ ‘ఆడ్ని కొట్టమని డప్పు.. నువ్వు కొట్టారా’ అనే బిట్ కు వార్నర్ తన షాడో బ్యాటింగ్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు.

ఈ వీడియో పోస్ట్ చేస్తూ’ ఇది నా షాడో బ్యాటింగ్, ఇంట్లో భార్య మరియు పిల్లలు ఉండటం మీరు విన్నారు కదా, మళ్ళీ కలుద్దాం’ అని సరదాగా పోస్ట్ చేశాడు. ఇక ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు కెప్టెన్‌ గా ఉన్న వార్నర్‌ తెలుగు సినిమాల పై ఇలా ఇంట్రస్ట్ చూపించడం బాగుంది.

ఇంటర్నేషనల్ స్టార్ క్రికెటర్ ఇలా తెలుగు సాంగ్స్ కి మరియు డైలాగ్స్ కి వరుస వీడియోలు చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. లాక్ డౌన్ సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు ఈ ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.

సంబంధిత సమాచారం :

More