వెంకీతో స్టార్ డైరెక్టర్ కన్ఫర్మే ?
Published on Jan 11, 2019 3:18 am IST

వి.వి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోన్నప్పటికీ ఆ సినిమాకి స్క్రిప్ట్ మాత్రం సెట్ కావట్లేదు. కాగా తాజా సమాచారం ప్రకారం ఆ సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య వినాయక్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు. తన తదుపరి సినిమాని బోయపాటితో బాలయ్య ఫిక్స్ చేశాడు. ఆ తరువాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఉంటుందని తెలుస్తోంది.

దాంతో వినాయక్ ఇంకో సీనియర్ హీరో వెంకటేష్ ని పట్టుకున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. వినాయక్ చెప్పిన కథని వెంకీ ఓకే చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆ వార్తలే నిజం అని తెలుస్తున్నాయి. ఇక గతంలో వెంకటేష్ తో కలిసి ‘లక్ష్మి’ సినిమాను రూపొందించాడు వినాయక్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకుంది. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. మరి ఈ సినిమాతోనైనా వినాయక్ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చిచూడాలి.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook