శ్రీ రాఘవ ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ టీజర్ రిలీజ్ డేట్

selvaraghava

కెరీర్ మొదట్లో సూపర్ హిట్ సినిమాలను ఇచ్చిన శ్రీ రాఘవ భారీ బడ్జెట్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసి చేసిన సినిమా ‘వర్ణ’. ఈ సినిమా తర్వాత లో ప్రొఫైల్ మైంటైన్ చేసిన శ్రీ రాఘవ మళ్ళీ ఇప్పుడు మీడియా ముందుకు రానున్నాడు. వర్ణ లాంటి సినిమా చేసిన ఫెయిల్ అయిన శ్రీ రాఘవ ఈ సారి తనకు ఎప్పుడూ కలిసి వచ్చిన ప్రేమకథతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన చేసిన 7/జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తరహాలోనే తన తదుపరి సినిమాని తెరకెక్కించాడు.

అందులో భాగంగానే ఈ ప్రేమకథకి ‘నన్ను వదిలి నీవు పోలేవులే’ అనే సాఫ్ట్ టైటిల్ ని ఫిక్స్ చేసారు. ఈ సినిమా ద్వారా మొత్తం నూతన నటీనటులను పరిచయం చేయనున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ని ఈ నెల 16వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ నెలాఖరు లోపే ఈ సినిమా ఔదిఒని కూడా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. శ్రీ రాఘవ తన ఫార్మాట్ ఓ చేసిన ఈ ఆసక్తికర ప్రేమకథ కచ్చితంగా హిట్ అవుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది.

Exit mobile version