‘భీష్మ’ కోసం స్టార్ డైరెక్టర్ వస్తున్నాడు !

Published on Feb 15, 2020 2:00 am IST

‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. కాగా ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ నెల 17న ఘనంగా జరగనుంది. అయితే తాజా విశేషమేమిటంటే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రానున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట.

కాగా ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ఇక నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More