ఎన్టీఆర్ సినిమా తమిళ రీమేక్లో స్టార్ హీరో !

21st, March 2018 - 09:59:39 PM


ఎన్టీఆర్ కెరీర్లోని భిన్నమైన హిట్ సినిమాల్లో పూరి దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ కూడ ఒకటి. ఈ చిత్రంతో నటుడిగా ఎన్టీఆర్ స్థాయి మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని ఇప్పటికే హిందీలో రీమేక్ చేసే పనులు మొదలుకాగా ఇప్పుడు తమిళంలో కూడ రీమేక్ చేయనున్నారు.

ఈ రీమేక్లో స్టార్ హీరో విశాల్ నటిస్తారట. అంతేగాక ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తారని, ఇందులో విశాల్ కు జోడీగా రాశీఖన్నా కూడ నటిస్తారని అంటున్నారు. అయితే ఈ వార్తపై ఇంకా విశాల్, రాశీఖన్నా, మురుగదాస్ లలో ఏ ఒక్కరి నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు.