అసురన్ లో ఆ స్టార్ హీరో లేడంట !

Published on May 2, 2019 6:51 pm IST

తమిళ హీరో ధనుష్ నటిస్తున్న ‘అసురన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల ఈ చిత్రం యొక్క ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈనెలలో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కానుంది. ఇక ఈచిత్రంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని వార్తలు రాగ తాజాగా చిత్ర యూనిట్ ఆ వార్తలను కొట్టిపారేసింది.

వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి 45 సంవత్సరాలు కలిగిన తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర. ఈ చిత్రంలో మంజు వారియర్ ,ధనుష్ కు జోడీగా నటిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More