‘రిపబ్లిక్ డే’ కి స్టార్ హీరో పొలిటికల్ డ్రామా ?

‘రిపబ్లిక్ డే’ కి స్టార్ హీరో పొలిటికల్ డ్రామా ?

Published on Nov 15, 2018 11:20 AM IST


తమిళ స్టార్ హీరో సూర్య, సెల్వ రాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్న 36వ చిత్రం ‘ఎన్జీకే’ చివరి షెడ్యూల్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతుంది. మరో వారం రోజులు పాటు జరిగే ఈ షెడ్యూల్ తో ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా టీజర్ వచ్చే ఏడాది జనవరి ఫస్ట్ వీక్ లో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు.

కాగా సినిమాను కూడా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో క్యూబా విప్లవ వీరుడు చేగువేరా గెటప్ లో సూర్య కనిపించనున్నాడు. చేగువేరా గెటప్ లో సూర్య సూపర్బ్ గా ఉన్నారని చిత్రబృందం చెబుతుంది.

పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవిలు కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ఆర్ ప్రకాష్ బాబు -ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు