కరోనా దెబ్బకు థియేటర్స్ బంద్ అయిపోవడం, పైగా నేటి యువతరం అభిరుచి కూడా వెబ్ కంటెంట్ వైపు మళ్లడంతో ఇప్పుడు వెబ్ సిరీస్ లు వేగంగా తెరకెక్కతున్నాయి. దాంతో అందరూ డిజిటల్ స్ట్రీమింగ్ వైపే వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోయిన్ సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్ చేయనుంది. ఇప్పుడు వీరి బాటలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా అడుగులు వేస్తుందట.
ఓ హిందీ వెబ్ సిరీస్ లో రకుల్ నటించడానికి ఇంట్రస్టింగ్ గా ఉందట. ఇది ఇద్దరి ట్విన్స్ మధ్య జరిగే సిరీస్ అని, తన ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న ఈ కథ రకుల్ కి బాగా నచ్చిందని, అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించబోతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ వెబ్ సిరీస్ ను విక్రమ్ అనే నూతన డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. అన్ని కుదిరితే అక్టోబర్ నుండి షూట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు.
మొత్తానికి కరోనా రాకతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చి పడింది. ఇప్పటికే బడా నిర్మాతలు డైరెక్టర్లు సైతం వెబ్ సిరీస్ లను నిర్మించే ప్లాన్ లో ఉన్నారు.
