కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం గత కొంత
కాలంగా కొరటాల పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించబోతుందని వార్తలు వస్తున్నా.. ఇప్పటి వరకు, ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషనే హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ జరుగుతోంది. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారట. ఇక ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారని.. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు సమాచారం.


