ఎమోషనల్ వెబ్ సిరీస్ లో స్టార్ హీరోయిన్ ?

ఎమోషనల్ వెబ్ సిరీస్ లో స్టార్ హీరోయిన్ ?

Published on Jan 25, 2020 3:52 PM IST

సినిమా చూడాలంటే థియేటర్స్ కి వెళ్లి చూడాలి. అదే డిజిటల్ స్ట్రీమింగ్‌ లో అయితే చేతిలో ఉన్న ఫోన్ లోనే చూసుకోవచ్చు. అందుకే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ కి కూడా బాగా డిమాండ్ పెరిగింది. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్ వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు. ఒకవైపు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే.. మరోవైపు వెబ్ సిరీస్ కథలను కూడా వింటూ, నచ్చితే నటించేస్తున్నారు. కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, సమంత వెబ్ సిరీస్ చేస్తున్నారు.

ఇప్పుడు వీరి బాటలోనే తమన్నా కూడా అడుగులు వేస్తున్నారట. తమన్నా తమిళంలోని ఓ వెబ్ సిరీస్ కథ పట్ల బాగా ఇంట్రస్టింగ్ గా ఉన్నారట. ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ స్టోరీతో సాగే సిరీస్ అట ఇది. ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో తమన్నా ఈ వెబ్ సిరీస్ లో నటించాలనుకుంటుందట. అన్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌ ను దర్శకుడు రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు