బాక్సాఫీస్ వద్ద వెనుక పడిన స్టార్ హీరో !

dabangg3 1

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనమైన వసూళ్లు సాధిస్తుంటాయి. సల్మాన్ సినిమాకి జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు, ఇక ఈజీగా ఆ సినిమా 200 కోట్ల మార్క్ ను చేరుకుంటుందని బాలీవుడ్ లో తరుచూ వినిపిస్తోంది. అయితే సల్మాన్ కొత్త సినిమా ‘దబంగ్ 3’ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తవుతున్నా.. ఇప్పటివరకూ 137 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మరోవైపు, అక్షయ్ కుమార్ సినిమా ‘గుడ్ న్యూస్’ మొదటి వారంలోనే 100 కోట్లు పైగానే కలెక్ట్ చేసి.. ఇంకా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన హవా కొనసాగిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా డౌట్ గానే కనిపిస్తోంది. రోజురోజుకు కలెక్షన్స్ తగ్గిపోవడంతో ఈ సినిమా ‘గుడ్ న్యూస్’కి పోటీ కూడా ఇవ్వలేకపోతుంది. కొరియోగ్రాఫర్ అండ్ హీరో ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా సోనాక్షి సిన్హా, సాయి మంజ్రేకర్ హీరోయిన్స్ గా నటించారు. ప్రముఖ కన్నడ స్టార్ కిచ్చా సుధీప్ ‘దబంగ్ 3’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర చేశారు. కాగా సల్మాన్ తదుపరి చిత్రం ‘రాధే’కి కూడా దర్శకుడిగా ప్రభుదేవా వ్యవహరించడం గమనార్హం.

Exit mobile version