మాస్ వైపే చూస్తోన్న స్టార్ హీరో కొడుకు ?

Published on May 25, 2020 7:02 pm IST

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ‘ధృవ్’ తమిళంలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధృవ్ ఈసారి కూడా అదే తరహా మాస్ సినిమా చేయాలని అనుకుంటున్నాడట.

ఇప్పటికే అలాంటి రెండు స్క్రిప్ట్స్ ను లైన్ లో పెట్టిన ఈ యంగ్ హీరో త్వరలోనే వాటిలో ఒక సినిమాని మొదలెట్టనున్నాడు. ఈ సినిమాకి మురుగ దాస్ అసిస్టెంట్ దర్శకుడు అంట. ఇక ధృవ్ ప్రస్తుతం కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడట. కొత్త హెయిర్ స్టైల్ తో పాటు షార్ప్ లుక్ కోసం ట్రై చేస్తున్నాడట. మొత్తానికి ఈసారి కూడా ధృవ్ రఫ్ అండ్ ఎనర్జిటిక్ పాత్రలోనే నటించడానికి ఆశ పడుతున్నాడు.

సంబంధిత సమాచారం :

More