యూ ట్యూబ్ స్టార్స్ తో స్టార్ మా “సండే ఫండే”

Published on Jul 7, 2021 4:50 pm IST

యూ ట్యూబ్ ద్వారా స్టార్స్ అయిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ప్రస్తుతం యంగ్ టాలెంట్ కి తెలుగు సినీ పరిశ్రమలో కొదువ లేదని చెప్పాలి. అయితే ఈ తరం యువ నటీనటులు యూ ట్యూబ్ ద్వారా తమ సత్తా చాటుతున్నారు. అయితే అందులో కొందరిని సండే ఫండే కార్యక్రమం కి ఆహ్వానించింది స్టార్ మా. అయితే ప్రతి వారం బుల్లితెర అభిమానులను అలరిస్తున్న స్టార్ మా కార్యక్రమాలు ఈ వారం యూ ట్యూబ్ స్టార్ లతో కార్యక్రమం చేయనుంది. యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం ను చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :