వెంకీ, వరుణ్ తేజ్ సినిమాకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ !
Published on Jun 9, 2018 11:18 am IST

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిస్ చేయనున్న మల్టీ స్టారర్ చిత్రం ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందట. ఇందులో వెంకీకి జోడీగా తమన్నా నటిస్తుండగా వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కనిపించనుంది.

ఇకపోతే ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని రావిపూడి స్వయంగా ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ చేరిక సినిమాకు తప్పకుండా అదనపు బలాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది. అనిల్ రావిపూడి గత చిత్రాలు ‘పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్’ మంచి విజయాల్ని సాధించి ఉండటంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొని ఉంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook