‘కిక్ 2’ బెనిఫిట్ షో కి రానున్న స్టార్స్ వీళ్ళే.!

‘కిక్ 2’ బెనిఫిట్ షో కి రానున్న స్టార్స్ వీళ్ళే.!

Published on Aug 20, 2015 8:33 AM IST

kick-2

మాస్ మహారాజ్ రవితేజ – టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘కిక్ 2’. 2009లో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ‘కిక్’ సినిమాకి సీక్వెల్ అయిన కిక్ 2 కి కూడా దర్శకుడు సురేందర్ రెడ్డినే కావడం విశేషం. సెన్సార్ నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఆగష్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ కి ఒకే ఒక్క రోజు మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ ని జోరుగా సాగుతున్నాయి. కిక్ సినిమాలో లానే ఈ సినిమాలో కూడా హై రేంజ్ కామెడీతో పాటు అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉండనున్నాయి.

హై రేంజ్ లో క్రేజ్ ఉన్న ఈ సినిమా అన్ని ఏరియాల్లో భారీగానే రిలీజ్ కానుంది. అంతే కాకుండా ఈ సినిమాకి హైదరాబాద్ లో బెనిఫిట్ షో కూడా వేస్తున్నారు. ఈ బెనిఫిట్ షోకి ఈ చిత్ర టీంలోని అందరూ హాజరవుతున్నారు. వారితో పాటు ముఖ్య అతిధులుగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, నందమూరి కళ్యాణ్ రామ్, రవితేజలు కూడా హాజరు కానున్నారు. ఈ బెనిఫిట్ షో రేపు ఉదయం భ్రమరాంబ థియేటర్ లో జరగనుంది. మరికెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీ ఫేవరైట్ స్టార్స్ తో కలిసి కిక్ 2 సినిమాని ఎంజాయ్ చెయ్యాలనుకుంటే ఇప్పుడే టికెట్స్ బుక్ చేస్కొండి.

కిక్ 2 లో మిమ్మల్ని బాగా నవ్వించడం కోసం టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందంతో పాటు బాలీవుడ్ కమెడియన్స్ రాజ్పల్ యాదవ్, సంజయ్ మిశ్రాలు కూడా ఉన్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు