ఓటిటిలో ఇప్పటికీ “హాయ్ నాన్న” హవా.!

ఓటిటిలో ఇప్పటికీ “హాయ్ నాన్న” హవా.!

Published on Feb 13, 2024 10:00 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా “హాయ్ నాన్న”. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ ని అందుకుంది. మరి ఈ చిత్రం థియేటర్స్ తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో పాన్ ఇండియా భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి గత జనవరి 4న ఓటిటిలో వచ్చిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అపుడే ఇండియా వైడ్ గా ట్రెండ్ అయ్యింది.

అయితే ఇప్పుడుకి కూడా ఈ చిత్రం ఇండియా వైడ్ గా టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది. హిందీ వెర్షన్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఇండియా వైడ్ గా టాప్ 8 లో ఇప్పటికీ ట్రెండ్ అవుతూ ఉండడం విశేషం. దీని బట్టి హిందీ వెర్షన్ లో ఆడియెన్స్ కి బాగానే నచ్చేసింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి హీశం అబ్దుల్ వాహద్ సంగీతం అందించగా కొత్త నిర్మాణం సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు