“పుష్ప” షూట్ ఇంకా ఇక్కడే ఉందా..?

“పుష్ప” షూట్ ఇంకా ఇక్కడే ఉందా..?

Published on Feb 28, 2021 8:38 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” అనే మాస్ అండ్ ఎమోషనల్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రం ఇటీవలే రెండో షెడ్యూల్ ను కూడా స్టార్ట్ చేసుకుంది.

అయితే ఈ షూట్ లో భాగంగా బన్నీ పైనే ఒక ఔట్ అండ్ ఔట్ మాస్ నెంబర్ ను ప్లాన్ చేసినట్టుగా క్లారిటీ వచ్చింది. అయితే లేటెస్ట్ గా చూసుకున్నట్టు అయితే మేకర్స్ ఇంకా అదే సాంగ్ పనిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికే ఆ సాంగ్ కు వర్క్ చేస్తున్న జానీ మాస్టర్ ఆన్ లొకేషన్ ఫోటోలను షేర్ చేస్తున్నాడు..

దీనితో ఇంకా ఈ సాంగ్ పూర్తి అవ్వలేనట్టే అనుకోవాలి. అయితే ఈ సాంగ్ కు గాను దేవిశ్రీప్రసాద్ ఔట్ స్టాండింగ్ ట్యూన్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది అంతే కాకుండా డాన్స్ పరంగా కూడా బన్నీ ఫ్యాన్స్ కి గట్టి ట్రీట్ నే ఇందులో ప్లాన్ చేసినట్టు కూడా టాక్..మరి ఇందులో బన్నీ తన మాస్ డాన్స్ ను చాలా కాలం తర్వాత చూపించడం ఖాయం అని చెప్పాలి. ఇక ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాని వచ్చే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు