ఈ వారం డబ్బింగ్ సినిమానా? లేక డైరెక్ట్ సినిమానా?

ఈ వారం డబ్బింగ్ సినిమానా? లేక డైరెక్ట్ సినిమానా?

Published on Mar 22, 2013 3:59 AM IST

telugu-3-movies

చిన్న సినిమాలకు వరం లా కనిపించిన మార్చి నెల ప్రతి వీకెండ్ లోనూ ఎక్కువగానే చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, కానీ అందులో 90% సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించి విజయాన్ని అందుకోలేక బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ సినిమాలుగా మిగిలిపోతున్నాయి. గత వారం ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’, ‘రయ్ రయ్’, ‘3జి లవ్’, ‘జగన్’, ‘దశమి’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఐదు సినిమాల్లో కొన్ని బాక్స్ ఆఫీసు వద్ద కాస్తో కూస్తో కాసులు రాల్చుకున్నా పెద్దగా ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయాయి. అదే కోవలోనే ఈ వారం కూడా ఓ 4 చిన్న హీరోల సినిమాలు, ఓ డబ్బింగ్ సినిమా మనముందుకు రానున్నాయి.

అందులో మొదటగా తెలుగులో బాగా క్రేజ్ ఉన్న తమిళ హీరో కార్తీ నటించిన ‘బ్యాడ్ బాయ్’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు శ్రీహరి ప్రధాన పాత్రలో నటించిన ‘బకరా’, నూతన నటీనటులతో తెరకెక్కిన ‘డబుల్ ట్రబుల్’ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ వారంలో ఒకరోజు ఆలస్యంగా శనివారం రోజు నిఖిల్ – వరుణ్ సందేశ్ లు తమ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడనున్నారు. నిఖిల్, స్వాతి జంటగా నటించిన ‘స్వామి రారా’, వరుణ్ సందేశ్, హసిక నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ సినిమాలు శనివారం విడుదల కానున్నాయి.

ఈ వారం డబ్బింగ్ సినిమా ప్రేక్షకుల మెప్పు పొంది బాక్స్ ఆఫీసు ని కొల్లగొడుతుందా లేక డైరెక్ట్ తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీసుని కొల్లగొడతాయా అనేది దాని కోసం మరో రెండు రోజులు వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు