Stranger Things 5: బాక్సాఫీస్ దగ్గర కూడా ‘స్ట్రేంజర్ థింగ్స్’ లాస్ట్ ఎపిసోడ్ సెన్సేషన్!

Stranger Things 5: బాక్సాఫీస్ దగ్గర కూడా ‘స్ట్రేంజర్ థింగ్స్’ లాస్ట్ ఎపిసోడ్ సెన్సేషన్!

Published on Jan 1, 2026 9:01 AM IST

Stranger Things

ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సిరీస్ నే “స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things) “. మొత్తం 5 సీజన్స్ గా వచ్చిన ఈ సిరీస్ నేటితో ముగిసిపోయింది. అయితే చివరి ఎపిసోడ్ రైట్ సైడ్ అప్ డౌన్ ని కేవలం నెట్ ఫ్లిక్స్ లోనే కాకుండా మేకర్స్ యూఎస్ మార్కెట్ లో లిమిటెడ్ గా థియేటర్స్ లో కూడా స్పెషల్ షోస్ వేశారు.

దాదాపు 600 పై చిలుకు థియేటర్స్ లో స్ట్రేంజర్ థింగ్స్ (Stranger Things) లాస్ట్ ఎపిసోడ్ ని స్క్రీనింగ్ కి తీసుకురాగా కేవలం వీటికే భారీ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. లేటెస్ట్ రూమర్స్ ప్రకారం కేవలం ఈ ఒక్కరోజు స్క్రీనింగ్ కి మాత్రమే ఈ ఎపిసోడ్ కి 15 మిలియన్ డాలర్స్ గ్రాస్ వసూలు చేసినట్టు తెలుస్తుంది.

దీనితో ఈ సిరీస్ కి ఉన్న క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇంత మొత్తం మన దగ్గర నుంచి ఒక సూపర్ హిట్ సినిమా లాంగ్ రన్ రేంజ్ లో అని చెప్పాలి. ఈ సిరీస్ ఓటిటిలోనే రికార్డులు తిరగ రాస్తుంది అనుకుంటే థియేటర్స్ లో కూడా అదరగొడుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు