“RRR” హీరోల నడుమ ఉన్న స్ట్రాంగ్ బాండింగ్.!

Published on Sep 23, 2020 8:00 am IST

మన తెలుగు సినీ తెర మీదనే గుర్తుండిపోయే ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ను దర్శక ధీరుడు రాజమౌళి తీసుకొచ్చారని చెప్పాలి.మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు సరైన హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఊహించని విధమైన మల్టీ స్టారింగ్ చిత్రాన్ని ప్రకటించడమే కాకుండా దానిని ఒక ఊహించని కాన్సెప్ట్ తో తెరకెక్కించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోల నడుమ ఉన్న బాండింగ్ కోసం తెలిసిందే.

కానీ అది ఎంత గట్టిగా ఉంది అన్నది మాత్రం తారక్ మాటల ద్వారా మరింత తెలిసింది. చాలా కాలం తర్వాత తారక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జక్కన్నతో దాదాపు పదమూడేళ్ల తర్వాత ఓ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని అలాగే రామ్ చరణ్ కోసం కూడా మాట్లాడుతూ రామ్ చరణ్ తనకు దేవుడిచ్చిన తమ్ముడు లాంటి వాడని చెప్పినట్టు తెలుస్తుంది. దీనితో తారక్ ఇచ్చిన స్టేట్మెంట్ ఈ ఇద్దరి హీరోల అభిమానులు కొందరి నడుమ ఉన్న చిన్నపాటి గీతను కూడా చెరిపేసినట్టు అయ్యింది. ప్రస్తుతం వీరు నటిస్తున్న “రౌద్రం రణం రుధిరం” చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More