స్ట్రాంగ్ బజ్ : “వీరమల్లు” రిలీజ్ డేట్ ఇదేనా?

స్ట్రాంగ్ బజ్ : “వీరమల్లు” రిలీజ్ డేట్ ఇదేనా?

Published on May 3, 2024 7:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. మరి కొత్తగా సినిమా భాద్యతలు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ చేపట్టగా సినిమా విషయంలో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ టీజర్ కట్ ని మేకర్స్ నిన్న రిలీజ్ చేయగా దీనికి అందరి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.

అయితే ఈ టీజర్ తోనే సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుంది అనే ట్విస్ట్ మరింత ఆసక్తికరంగా మారగా ఇప్పుడు ఆ డేట్ ఎప్పుడు అనేది తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా డిసెంబరు 20న లేదా క్రిస్మస్ రేస్ డేట్ లో రానుంది అని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది బాబీ డియోల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు