విజయ్ చివరి సినిమాపై స్ట్రాంగ్ బజ్.!

విజయ్ చివరి సినిమాపై స్ట్రాంగ్ బజ్.!

Published on Apr 2, 2024 7:59 PM IST

సౌత్ ఇండియా సినిమా దగ్గర అపారమైన ఆదరణ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) కూడా ఒకడు. మరి ఇపుడు తాను దర్శకుడు వెంకట్ ప్రభుతో తన కెరీర్ 68వ చిత్రాన్ని “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (Greatest Of All Time) అంటూ చేస్తుండగా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తూ విజయ్ చివరి సినిమా (Thalapathy 69 Director) ఏంటి ఎవరితో అనేది కూడా క్లారిటీ కోసం చూస్తున్నారు. అయితే మన తెలుగు సహా తమిళ్ నుంచి చాలా మంది పేర్లు వినిపిస్తూ వచ్చాయి కానీ ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ గా మాత్రం ఓ దర్శకుడు పేరే వినిపిస్తుంది. అతడే హెచ్ వినోద్.

“ఖాకీ”, “వలిమై”, “తెగింపు” లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చిన తాను విజయ్ చివరి సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు అని కోలీవుడ్ వర్గాల్లో ఇపుడు గట్టిగా వినిపిస్తుంది. రీసెంట్ గానే బజ్ కూడా వచ్చింది కానీ ఇపుడు ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పుడు చేస్తున్న సినిమా తర్వాత వెంటనే ఈ క్రేజీ కాంబినేషన్ షురూ కానుంది అని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు