కన్ఫర్మ్.. చై “తండేల్” రిలీజ్ డేట్ ఖరారు.!

కన్ఫర్మ్.. చై “తండేల్” రిలీజ్ డేట్ ఖరారు.!

Published on Apr 17, 2024 3:15 PM IST

అక్కినేని వారి యంగ్ అండ్ ఫైనెస్ట్ హీరో నాగ చైతన్య హీరోగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు చందూ మోడిటీ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా మరో పక్క రిలీజ్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ రిలీజ్ డేట్ పై స్ట్రాంగ్ బజ్ బయటకి వచ్చింది.

ఇది వరకు ఈ సినిమా అక్టోబర్ లో వస్తుంది అని వినిపించింది. కానీ సినీ వర్గాల లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ డేట్ పై అధికారిక క్లారిటీ కూడా అతి త్వరలోనే రానున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు భారీ వ్యయంతో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు