ఈ రెండిట్లో “ఇండియన్ 2” రిలీజ్ డేట్ లాక్.!?

ఈ రెండిట్లో “ఇండియన్ 2” రిలీజ్ డేట్ లాక్.!?

Published on May 19, 2024 1:00 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అలాగే రకుల్ ప్రీత్ సింగ్ మరియు సిద్ధార్థ్ ల కలయికలో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం తెలుగులో “భారతీయుడు 2” గా రాబోతుండగా ఈ సినిమా జూన్ నుంచి జూలై కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరి జూలై లో ఈ చిత్రం 11 లేదా 17 రిలీజ్ అవుతుంది అని కొన్ని రూమర్స్ అయితే ఆ మధ్య వచ్చాయి.

మరి ఇప్పుడు వీటిలో ఓ డేట్ ని అయితే మేకర్స్ లాక్ చేసినట్టుగా నయా బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ జూలై 17న గ్రాండ్ గా ఇండియన్ 2 పాన్ ఇండియన్ భాషల్లో రానుంది అట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఆల్రెడీ శంకర్, కమల్ లు ప్రమోషన్స్ ని కూడా మొదలు పెట్టేసారు. మరి ఈ క్రమంలో ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు