పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ అలాగే రిద్ది కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతి తెరకెక్కించిన అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే ది రాజా సాబ్ (The Raja Saab). మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా యూఎస్ మార్కెట్ లో ఆల్రెడీ స్ట్రాంగ్ బుకింగ్స్ ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 7 లక్షల డాలర్లుకి పైగా రాబట్టి 7 లక్షల 50 వేల మార్క్ ని దాటేసింది.
ఇక సినిమా రిలీజ్ అయ్యే నాటికి ఈజీగా 1 మిలియన్ మార్క్ ని కేవలం ప్రీమియర్, ప్రీ సేల్స్ లో అందుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బొమన్ ఇరానీ, సంజయ్ దత్ తదితరులు నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా జనవరి 9న రిలీజ్ కాబోతోంది.
REBEL SAAB TAKE OVER ????
$750K+ North America Premieres Pre-sales and Counting ❤️????#TheRajaSaab Premieres on JAN 8th, Overseas release by @PrathyangiraUS @People_Cinemas
????️ https://t.co/2peay5XzHr#Prabhas @peoplemediafcy @DirectorMaruthi pic.twitter.com/mOkibGQVyT
— Prathyangira Cinemas (@PrathyangiraUS) January 7, 2026
