రాహుల్ మూవీ మేకర్స్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఫస్ట్ లుక్ & ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ…
మంచి సందేశం ఉన్న కథతో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా తీయ్యడం జరిగింది. నేను తెలుగులో తీసున్న మూడో సినిమా ఇది. డైరెక్టర్ కరుణ కుమార్ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు. హీరో శ్రీనాధ్ మాగంటి బాగా నటించాడు. హరిప్రసాద్ గారు మాకు మంచి కథను అందించారు. డబ్బు వస్తుందా లేదా అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న తృప్తి ఉందన్నారు.
డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ..
పోస్టర్, ట్రైలర్ బాగున్నాయి. డిస్టిబ్యూటర్స్ ఈ సినిమాను తీసుకోవాలి అనుకునేలాగా అట్రాక్టుగా ఉన్నాయి. ఈ సినిమాకు కథ అందించిన హరి ప్రసాద్ నాకు 1 నేనొక్కడినే, 100%లవ్ చిత్రాలకు కథ అందించారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు ఎలాంటి కథ ఇచ్చి ఉంటాడో. డైరెక్టర్ కరుణ కుమార్ హరి ప్రసాద్ అందించిన కథను అద్భుతంగా తెరకెక్కించి ఉంటాడని భావిస్తున్నాను అన్నారు.
డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ…
నా నిర్మాత ఓబుల్ రెడ్డి సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. హీరో , హీరోయిన్స్ ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్ కు ప్రేత్యేక కృతజ్ఞతలు. నా మిత్రుడు హరి ప్రసాద్ చక్కటి మెసేజ్ ఉన్న కథను అందించాడు. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పడం జరిగింది. అందరికి ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ…
మంచి చిత్రాలకు మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటుంది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చెయ్యడం సంతోషం, ఈ సినిమా స్టూడెంట్స్ మీద తీసిన కథాంశం. ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమా ఉండబోతోంది. నిర్మాత ఓబుల్ రెడ్డికి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నాం అన్నారు.
నటీనటులు:
సంజయ్ ఇదామ
శ్రీనాధ్ మాగంటి
అహల్య సురేష్
ప్రియ
సుకుమార్ చేతుల మీదుగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ట్రైలర్ లాంచ్ !!!
సుకుమార్ చేతుల మీదుగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ట్రైలర్ లాంచ్ !!!
Published on Oct 9, 2019 5:26 PM IST
సంబంధిత సమాచారం
- లేటెస్ట్: ‘పెద్ది’ రెండో సాంగ్ డేట్ వచ్చేసింది.. మాస్ మేనియా ఎప్పుడు నుంచంటే!
- ఫోటో మూమెంట్: మెహర్, వినాయక్ లతో డార్లింగ్ కల్మషం లేని చిరునవ్వు
- ‘వారణాసి’: రామాయణ యుద్ధ సన్నివేశాలన్నీ ఇక్కడే
- India vs Zimbabwe T20 World Cup 2026: ‘డూ ఆర్ డై’ మ్యాచ్‌కు రెడీ అయిన టీమిండియా.. నెట్స్‌లో భారీ సిక్సర్లతో ప్రాక్టీస్!
- అనిరుద్ మ్యాజిక్.. అప్పుడు ‘దేవర’కి ఇప్పుడు ‘ప్యారడైజ్’కి
- అఫీషియల్ గా భార్య భర్తలైన విజయ్, రష్మిక.. సరిగ్గా ఇన్ని నిమిషాలకి!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న దివ్య శ్రీపాద ‘చరిత కామాక్షి’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- షాకింగ్: ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి అక్కడ బిజినెస్ ఇంకా అవ్వలేదా?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘శ్రీ చిదంబరం గారు’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘ది బ్లఫ్’ – తెలుగు డబ్ హాలీవుడ్ చిత్రం ప్రైమ్ వీడియోలో
- నార్త్ మార్కెట్ లో ‘టాక్సిక్’ని తక్కువ అంచనా వేస్తున్నారా?
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘వారణాసి’ బ్యూటీ హాలీవుడ్ యాక్షన్ సినిమా.. ఎందులో అంటే
- ‘పెద్ది’ రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా?
- ‘భోగి’ ఫస్ట్ లుక్.. బీస్ట్ మోడ్ లో శర్వానంద్, రిలీజ్ డేట్ కూడా ఖరారు
- ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి భారీ ఆఫర్.. ఏకంగా ‘పుష్ప’ మేకర్స్ తో?
- కోర్ట్ జంట ‘బ్యాండ్ మేళం’ టీజర్ లాంచ్ ఈవెంట్లో శివాజీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- మళ్ళీ ‘అతడు’ ర్యాంపేజ్.. ఇలా బుకింగ్స్ మొదలయ్యాయో లేదో


