గుంటూరులో ‘స్టూడియో 81 సినిమాస్’ ప్రారంభం

గుంటూరులో ‘స్టూడియో 81 సినిమాస్’ ప్రారంభం

Published on Mar 21, 2026 9:00 PM IST

s 13

ఉగాది పండుగను పురస్కరించుకుని గుంటూరు నగర నడిబొడ్డున ‘స్టూడియో 81 సినిమాస్’ పేరుతో నూతన థియేటర్లు ప్రారంభమయ్యాయి. అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ హంగులతో కూడిన ఈ మల్టీప్లెక్స్‌ను ప్రేక్షకుల వినోదం, సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

మొత్తం ఐదు స్క్రీన్లతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్లలో ఒకేసారి 849 మంది కూర్చునే సామర్థ్యం ఉంది. వీక్షకులకు అత్యుత్తమ దృశ్య అనుభూతిని పంచేందుకు 4K లేజర్ ప్రొజెక్షన్, సిల్వర్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విశాలమైన లాబీలు, సౌకర్యవంతమైన వెయిటింగ్ ఏరియాలు, సులభతరమైన టికెటింగ్ వ్యవస్థతో పాటు ఉచిత వై-ఫై సదుపాయాన్ని కూడా కల్పించారు.

కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులకు సినిమాతో పాటు ఆహార పానీయాల విషయంలోనూ ప్రత్యేక అనుభూతిని అందించనున్నారు. ముఖ్యంగా అమెరికా నుంచి రప్పించిన ప్రత్యేకమైన ‘నెబ్రాస్కా’ మొక్కజొన్న, వివిధ రకాల మసాలా దినుసులతో తయారు చేసిన పాప్‌కార్న్ ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సాంకేతికత, సౌకర్యం మేళవింపుగా ఏర్పాటైన ‘స్టూడియో 81 సినిమాస్’ గుంటూరు వాసులకు సరికొత్త వినోదాన్ని పంచుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు