స్టడీగా శర్వానంద్ ‘మళ్లి మళ్లీ ఇది రాని రోజు’ కలెక్షన్స్.

Malli-Malli-idi-rani-roju
‘రన్ రాజా రన్’ వంటి ఘన విజయం తర్వాత యువహీరో శర్వానంద్ నటించిన సినిమా ‘మళ్లి మళ్లీ ఇది రాని రోజు’. ప్రతి కథలో వైవిధ్యం, కొత్త తరహా పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చే శర్వానంద్.. మరోసారి అటువంటి కథను ఎంపిక చేసుకున్నారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. దీనికి ‘రన్ రాజా రన్’ విజయం ఓ కారణం అని చెప్పొచ్చు. వీకెండ్ తర్వాత సోమవారం కూడా ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మెచ్యూర్ లవ్ స్టొరీగా తెరకెక్కిన ఈ సినిమా సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలో వాలంటైన్ డే సమీపిస్తుండడంతో కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.

తెలుగులో ఇటివల కాలంలో వచ్చిన మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీలలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ ఒకటని విమర్శకుల ప్రసంశలు అందుకున్న ఈ సినిమాలో శర్వానంద్, నిత్యా మీనన్ లు ఒకరితో ఒకరు పోటిపడి నటించారు.

క్రాంతి మాధవ్ దర్శకత్వం, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు, సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుండడంతో కుటుంబ ప్రేక్షకుల ఆదరణ సినిమాకు బాగుంది. కెఎస్ రామారావు సమర్పణలో కె.ఏ.వల్లభ ఈ సినిమాను నిర్మించారు.

Exit mobile version