దర్శకుడిగా మారనున్న ఫైట్ మాస్టర్

దర్శకుడిగా మారనున్న ఫైట్ మాస్టర్

Published on Sep 3, 2019 4:21 PM IST

ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారనున్నారు. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వెలువడింది. లక్ష్యం, లక్ష్మీ, రేసు గుర్రం, అల్లుడు శ్రీను వంటి హిట్ చిత్రాలు నిర్మించిన లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత నల్లమలుపు బుజ్జి ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలోని నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

తమిళనాడుకి చెందిన పీటర్ హెయిన్స్ తెలుగు, తమిళ చిత్రాలతో పాటు, అనేక భాషలలో స్టంట్ మాస్టర్ గా పనిచేశారు. దేశంలోనే గొప్ప చిత్రాలుగా చెప్పుకొనే బాహుబలి, రోబో వంటి చిత్రాలకు కూడా పీటర్ హెయిన్స్ స్టంట్ మాస్టర్ గా పనిచేయడం విశేషం. మరి స్టంట్ మాస్టర్ గా ఇప్పటివరకు అనేక చిత్రాలలో అద్భుత పోరాట సన్నివేశాలను రూపొందించిన ఆయన దర్శకుడిగా ఎటువంటి చిత్రం తెరకెక్కిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు