రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్’. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. కాగా ఈ లుక్ లో కార్తీ స్టైలిష్ గా… చేతిలో హెల్మెట్ తో ,వెనకాల రేసింగ్ బైక్ తో కనిపిస్తూ.. కార్తీ సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా కి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.
కాగా ముంబై , హిమాలయాస్ వంటి ప్రదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


