
చూడడానికి ఆరడుగులపైనే పొడవుండి, బలమైన బాహువులు కలిగి, చూడటానికి గంభీరంగా ఉండి, కటౌట్ చూసి వామ్మో ఇంత ఉందేంది అనే ఫీలింగ్ కలిగించిన టాలీవుడ్ లేటెస్ట్ విలన్ కబీర్ దుహన్ సింగ్. జిల్ సినిమాతో విలన్ అంటే ఇలా ఉండాలి అనిపించుకున్న కబీర్ సింగ్ కి క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్స్ వస్తున్నాయి. జిల్ తర్వాత కిక్ 2 లో కనిపించిన కబీర్ ఇటీవలే అజిత్ 56వ మూవీ మరియు పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లో ఛాన్స్ కొట్టేసాడు. దీనితో పాటు టాలీవుడ్ లో మరో స్టార్ హీరో సినిమాలో ఢీ అంటే ఢీ అనే విలన్ పాత్రలో నటించే ఛాన్స్ కొట్టేసాడు.
అది మరెవరో కాదు టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ. శ్రీవాస్ డైరెక్షన్ లో నడమూరి బాలకృష్ణ కెరీర్లోనే చాలా డిఫరెంట్ గా ఉండేలా తెరకెక్కిస్తున్న సినిమా ‘డిక్టేటర్’. ఈ సినిమాలో బాలయ్యని ఢీ కొట్టే విలన్ గా కబీర్ సింగ్ కనిపించనున్నాడు. రవికిషన్ మరో విలన్ గా కనిపించనున్నాడు. ఇటీవలే హైదరాబద్ లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం త్వరలోనే యూరప్ వెళ్లనున్నారు. అక్కడ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు రెండు పాటలని, కొన్ని సీన్స్ ని కూడా షూట్ చేయనున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథని అందించిన ఈ సినిమాని ఎరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి శ్రీవాస్ నిర్మిస్తున్నాడు.