ఫేమస్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ వద్ద మెగా హీరో సందడి

sai-daram-teja
‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘రేయ్’ సినిమాల తర్వాతా మెగా ఫ్యామిలీ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మాస్ ఆడియన్స్ ని మెప్పించే హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రెజీన కసాండ్ర రెండవ సారి సాయి ధరమ్ తేజ్ సరసన జోడీ కడుతోంది. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం ఇటీవలే ఓ లాంగ్ షెడ్యూల్ కోసం యుఎస్ వెళ్ళారు. మొదటి వారం రోజులు మంచి లొకేషన్స్ కోసం అన్వేషించిన ఈ చిత్ర టీం మే మొదటి వారంలో షూటింగ్ ని మొదలు పెట్టారు.

గత రెండు రోజులుగా ఈ చిత్ర టీం న్యూ యార్క్ సిటీ లోని ఫేమస్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సీన్స్ ని షూట్ చేసారు. ఈ షూటింగ్లో సాయి ధరమ్ తేజ్ తో పాటు రెజీన కూడా పాల్గొంటోంది. అమెరికాలో షూట్ చేసే ఎపిసోడ్ ఈ సినిమాకి చాలా కీలకం మాత్రమే కాకుండా మూవీకి కూడా హైలైట్ అవుతుందని సమాచారం. ఈ యుఎస్ షెడ్యూల్ తో 80%పైనే షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాత ఇండియాలోని పలు లోకేషన్స్ లో షూట్ చేస్తారు. ఈ సినిమాలో ఆద శర్మ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. పూర్తి కమర్షియల్ హంగులతో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version