మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘రేయ్’ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయిధరమ్ తేజ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేసిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. మొదటి సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న సాయిధరమ్ తేజ్ – రెజీన కసాండ్ర రెండవ సారి ఈ సినిమాలో జోడీ కట్టారు. సాయిధరమ్ తేజ్ కి మొదటి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజునే ఈ సినిమాని కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించాడు. ఈ సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని ఆగష్టు 23న గ్రాండ్ గా హైదరాబాద్ లో చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం.
తాజాగా ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియో లాంచ్ కోసం శిల్పకళా వేదికని ఫైనలైజ్ చేసారు. చాలా గ్రాండ్ గా జరగనున్న ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాని సెప్టెంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేసారు.
అమెరికాలో షూట్ చేసిన మెయిన్ ఎపిసోడ్ ఈ మూవీకి హైలైట్ అవుతుందని సమాచారం. ఈ మూవీలో ఆద శర్మ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. ఇటీవలే రిలీజ్ చేసిన స్పెషల్ ఆడియో రిలీజ్ టీజర్ కి వచ్చిన సూపర్బ్ రెస్పాన్స్ తో సినిమాపై హైప్ పెరిగింది. పూర్తి కమర్షియల్ హంగులతో రానున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.


