
మామయ్యతో ‘గబ్బర్ సింగ్’ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడు అల్లుడు సాయిధరమ్ తేజ్ తో చేసిన సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్నదాని ప్రకారం అన్ని కార్యక్రమాలను ఆన్ టైం ఫినిష్ చేసి సెప్టెంబర్ 24న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మిక్కీ జె మేయర్ అందించిన మ్యూజిక్ ఆల్బం ఇటీవలే మార్కెట్ లోకి వచ్చింది. ఈ సినిమాలోని అన్ని పాటలకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఈ చిత్ర టీం గ్రాండ్ గా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసే పనిలో ఉన్నారు.
అది కూడా మెగా ఫ్యామిలీకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తిరుపతిలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్లాన్ చేస్తుండడం విశేషం,. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ 19వ తేదీన తిరుపతిలో గ్రాండ్ గా సుబ్రమణ్యం ఫర్ సేల్ ప్లాటినం డిస్క్ వేడుకని చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇదే తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఎక్కువ భాగం ఇదే తేదీన వేడుకని నిర్వహించేలా ప్లాన్ చేసున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. సాయిధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని ఎక్కువ భాగం అమెరికాలో షూట్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సూపర్ గా జరుగుతోంది. ఇప్పటికే 4 కోట్లకి మా టీవీ వారు శాటిలైట్ రైట్స్ ని తీసుకున్నారు.

