బన్నీతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ?

Published on Apr 5, 2021 7:01 am IST

అనిల్ రావిపూడి వరుస సక్సెస్ లతో మొత్తానికి స్టార్ హీరోల హాట్ ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. కాగా అల్లు అర్జున్ – అనిల్ రావిపూడి కలయికలో ఒక సినిమా రానుందని తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కథ విషయమై సంప్రదింపులు కూడా జరిపారట. పుష్ప చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో బన్నీ తన తర్వాతి సినిమాలను కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో భాగంగానే బన్నీకి అనిల్ ఓ కథ చెప్పాడట.

ఆ కథ నచ్చడంతో అనిల్‌తో పనిచేసేందుకు బన్నీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇలా క్రేజీ కలయికలో మొత్తానికి త్వరలోనే ఓ ఫుల్ ఫన్ తో సాగే సినిమా రాబోతుంది అన్నమాట. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’తో అలాగే ఎఫ్ 2తో సూపర్ హిట్స్ కొట్టి ఫుల్ ఫామ్ లో కొనసాగుతూ.. ప్రస్తతం ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :