తెలుగునాట విడుదలకానున్న తమిళ సూపర్ హిట్ హర్రర్ సినిమా

తెలుగునాట విడుదలకానున్న తమిళ సూపర్ హిట్ హర్రర్ సినిమా

Published on Jul 1, 2015 11:40 PM IST

Demonte
తమిళనాట సూపర్ హిట్ అయిన హర్రర్ డ్రామా “Demonte Colony” ఇప్పుడు అదే పేరుతొ తెలుగులోకి అనువాదం అవుతుంది. ఆరుళ్ నితి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అజయ్ తెరకెక్కించారు. చెన్నైలో ఒక ఏరియాలో జరిగే సంఘటనల నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

జులై 17న ఈ అనువాద వెర్షన్ మనముందుకు రానుంది. రెండున్నర కోట్లతో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 15కోట్లను సంపాదించుకుంది. పిశాచి, నాలో ఒక్కడు సినిమాల అనువాద హక్కులను సొంతం చేసుకున్న ప్రకృతి సంస్థ ఈ చిత్ర హక్కులను కూడా సొంతం చేసుకుంది. హర్రర్ సినిమాలు రాజ్యమేలుతున్న నేపధ్యంలో ఈ చిత్రం పై అంచనాలు వున్నాయి. లారెన్స్ ‘గంగ’, సూర్య ‘మాస్’ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

తాజా వార్తలు