‘బాహుబలి’లో అస్లామ్ ఖాన్‌గా సుధీప్ అదుర్స్!

Sudeep_Baahubali-1
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈలోగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్తేజాన్ని పెంచడానికి సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన వారి పోస్టర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.

ఈ క్రమంలోనే బాహుబలి ఫస్ట్‌లుక్ పోస్టర్, శివుడు పాత్రలో నటించిన ప్రభాస్ పోస్టర్, దేవసాన పాత్రలో నటించిన అనుష్క పోస్టర్‌, శివగామిగా నటించిన రమ్యకృష్ణ పోస్టర్‌, కాళకేయగా నటించిన ప్రభాకర్ పోస్టర్, బిజ్జలదేవగా నటించిన నాజర్ పోస్టర్, కట్టప్పగా నటించిన సత్యరాజ్ పోస్టర్ ఇలా ఒక్కో పోస్టర్‌తో సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ వరుసలో అస్లామ్ ఖాన్‌గా నటించిన సుధీప్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

‘ఈగ’ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ సంపాదించిన కన్నడ హీరో సుధీప్, రాజమౌళి కోరగా బాహుబలిలో అస్లామ్ ఖాన్ పాత్రను పోషించారు. నేడు రిలీజ్ చేసిన పోస్టర్‌లో అస్లామ్ ఖాన్‌గా సుధీప్ బాగా ఆకట్టుకుంటున్నారు. కొద్దిసేపే ఉండే ఈ పాత్ర సినిమాలో కీలకం కానుందని తెలుస్తోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Exit mobile version