తెలుగులో నిలదొక్కుకుంటున్న మలయాళ నటుడు సుదేవ్ నాయర్

తెలుగులో నిలదొక్కుకుంటున్న మలయాళ నటుడు సుదేవ్ నాయర్

Published on Jan 30, 2026 8:00 AM IST

Sudev Nair Shines

మలయాళ నటుడు సుదేవ్ నాయర్ తనదైన విలక్షణ నటనతో టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ఇటీవల ‘ఓజీ’ చిత్రంలో తన పర్ఫార్మెన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుదేవ్, తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రంతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుదేవ్ పోషించిన వైవిధ్యమైన పాత్ర, ఆయన చూపిన హావభావాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉండటంతో యాక్షన్ సన్నివేశాల్లో సుదేవ్ సహజంగా నటిస్తూ మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవుతున్నారు. పాత్రకు తగ్గట్టుగా దేహధారుఢ్యాన్ని మార్చుకుంటూ పరకాయ ప్రవేశం చేయడం ఆయన ప్రత్యేకత. తెలుగు భాషపై, సినిమాలపై ఉన్న మక్కువతో భవిష్యత్తులో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని సుదేవ్ ఆశిస్తున్నారు.

ప్రస్తుతం యష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో సుదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సుదేవ్ నాయర్, టాలీవుడ్ మేకర్లకు బెస్ట్ ఛాయిస్‌గా మారుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు