తన మొదటి ప్రేమ కథ చెబుతానంటున్న హీరో !

తన మొదటి ప్రేమ కథ చెబుతానంటున్న హీరో !

Published on Feb 27, 2021 7:15 PM IST

దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్‌లో నటుడు సుధీర్‌బాబు ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సమ్మోహనం, వీ చిత్రాలు తరువాత వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మూడో సినిమా ఇది. అన్నట్టు ఈ సినిమాలో సుధీర్‌కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి నటించనుంది. ప్రస్తుతం సుదీర్‌14 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టైటిల్‌ను ఇంకా ఫిక్స్‌ కాలేదు.

కాగా సుదీర్‌ 14గా రూపొందుతున్న ఈసినిమా టైటిల్‌ను మార్చి 1న ప్రకటించనున్నట్లు సుదీర్‌బాబు శనివారం సోషల్‌ మీడియాలో సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అందించారు. ఈ మేరకు 90 సెకన్ల నిడివి ఉన్న వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ప్రేమ గురించి మాట్లాడుతూ తమ మొదటి ప్రేమ కథను అందరికి ఎలా వివరిస్తామో తెలుపుతామన్నారు. మరి సుధీర్ ఎలాంటి ప్రేమ కథ చెబుతాడో చూడాలి. ఇక వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూరుస్తుండగా.. పీవీ వింద్యా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు