సుధీర్ బాబు ‘హ‌రోం హ‌ర’ ట్రైల‌ర్.. వెరీ ప‌వ‌ర్ ఫుల్!

సుధీర్ బాబు ‘హ‌రోం హ‌ర’ ట్రైల‌ర్.. వెరీ ప‌వ‌ర్ ఫుల్!

Published on May 30, 2024 11:53 AM IST

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు న‌టిస్తున్న తాజా చిత్రం ‘హ‌రోం హ‌ర’ ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను జ్ఞానసాగ‌ర్ ద్వార‌క డైరెక్ట్ చేయ‌గా పూర్తి యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ మూవీ రాబోతుంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్ట‌ర్స్, టీజ‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రిలీజ్ చేశారు.

‘హ‌రోం హ‌ర’ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కోసం సుధీర్ బాబు ఎంత‌లా క‌ష్ట‌ప‌డ్డాడో మ‌నకు క‌నిపిస్తుంది. పూర్తిగా చిత్తూరు యాస‌లో సాగిన ఈ ట్రైల‌ర్ లో ఆయ‌న డైలాగ్ డెలివ‌రీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. తుపాకుల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో యాక్ష‌న్ కు కొద‌వే లేద‌ని ఈ ట్రైల‌ర్ చూస్తుంటే స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఇక సుధీర్ బాబు మేకోవ‌ర్ కూడా ఆడియెన్స్ కు బాగా న‌చ్చుతుంది. అటు సునీల్ కూడా మ‌రోసారి త‌న‌దైన ప‌ర్ఫార్మెన్స్ తో ఈ సినిమాకు అసెట్ గా మార‌నున్న‌ట్లు ట్రైల‌ర్ క‌ట్ చూస్తే అర్థ‌మ‌వుతోంది.

అద్భుత‌మైన విజువ‌ల్స్, ఆక‌ట్టుకునే బీజీఎం, కావాల్సినంత యాక్ష‌న్ డోస్, మాస్ డైలాగుల‌తో ‘హ‌రోం హ‌ర’ ట్రైల‌ర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఈ సినిమాలో మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా చేత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతాన్ని అందించారు. జ‌య‌ప్ర‌కాశ్, అక్ష‌ర‌, అర్జున్ గౌడ‌, ల‌క్కి ల‌క్ష్మ‌ణ్, ర‌వి కాలె త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాను జూన్ 14న రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు