Subscribe to our Youtube Channel
 
Like us on Facebook
 
రైటర్ డైరెక్షన్ లో సుధీర్ బాబు నిజమేనా ?
Published on Jan 13, 2019 2:05 am IST

యాక్టర్ గా సినీ ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత డైలాగ్ రైటర్ గా టర్న్ అయి.. నితిన్ ‘గుండె జారి గల్లంతయిందే’ సినిమాతో రైటర్ గా సక్సెస్ అయి.. మనం సినిమాతో రచయితగా ఇంకా మంచి పేరు తెచ్చుకున్నాడు హర్ష వర్ధన్. అయితే హర్ష వర్ధన్ ఇప్పటికే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాకు డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు తన రెండో సినిమా డైరెక్షన్ కోసం సుదీర్ బాబుకు రీసెంట్ గా ఓ కథ చెప్పారట. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్టు చెయ్యడానికి సుధీర్ బాబు అంగీకరించారని గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తలు నిజమే అని తెలుస్తోంది.

కాగా ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో సుధీర్ బాబు తెలుగు తెరకు ప్రొడ్యూసర్ కూడా పరిచయం అయ్యారు. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బయోపిక్ లో నటిస్తోన్న విషయం తెలిసిందే. సుధీర్బాబు సినిమాల్లోకి రాకముందు బాడ్మింటన్‌ ప్లేయరే కావడం విశేషం.

సంబంధిత సమాచారం :