సుధీర్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది !

Published on Aug 17, 2018 1:40 pm IST

‘సమ్మోహనం’ చిత్ర విజయం తో ఫుల్ జోష్ లో ఉన్న హీరో సుధీర్ బాబు 11 వ చిత్రం ఈ రోజు రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నూతన దర్శకుడు పులి వాసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుధీర్ కు జోడిగా మెహ్రీన్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని రీజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

ఇక ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో సుధీర్ బాబు నటిస్తున్న’నన్ను దోచుకుందువటే’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. నాబా నటేష్ కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్నీ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More